కార్తీక మాసం ఎఫెక్ట్.. పెరిగిన కొబ్బరి ధరలు
కోనసీమ: అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో కొబ్బరికాయ ధర రూ. 29కి చేరుకోవడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ధరలు పెరుగుతున్న సమయంలో ఒక్కొక్క కొబ్బరికాయ చొప్పున రైతుల నుంచి వెయ్యి కాయలు రూ. 23 వేల-24 వేల లోపు కొనుగోలు చేస్తున్నారు. కార్తీమాసంలో భారీ రేటు వస్తుందని నిలువచేసిన కాయలను విక్రయిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.