ఎమ్మిగనూరులో ఉద్యోగ మేళా ఎప్పుడంటే?

KRNL: ఈ నెల 8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గోనెగండ్ల ఎంపీడీవో మణిమంజరి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే మేళాకు పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారందరూ అర్హులన్నారు. ఆసక్తి గలవారు మూడు జతల జిరాక్స్ పత్రాలతో బయోడేటా ఇవ్వాలన్నారు. వివరాలకు 7799494856, 9642735717 నంబరులో సంప్రదించాలన్నారు.