'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దోపిడీని అరికట్టాలి'
NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు చేస్తున్న దోపిడిని అరికట్టాలని బిఎస్పీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కత్తుల కాన్షీరామ్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. గురువారం కట్టంగూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హమాలీలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.