తైపురంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం
AKP: ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా నేడు తైపురంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 31 పశువులకు సాధారణ, గర్భకోశ చికిత్సలు అందించగా, 672 గొర్రెలు-మేకలకు వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గొర్రెల పెంపకదారుల సంఘం ప్రతినిధి ధనరాజు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.