వ్యభిచార గృహం గుట్టును రట్టు చేసిన పోలీసులు

WGL: నర్సంపేట మండలం మాదన్నపేట రోడ్డులో నేడు ఓ ఇంటిలో రహస్యంగా వ్యభిచార గృహం నడుపుతున్న ఆరుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ ఆకస్మిక దాడులు చేసి ముగ్గురు విటులు, ముగ్గురు సెక్స్ వర్కర్లతో పాటు ఐదు సెల్ ఫోన్లు, రూ. 2000 నగదును స్వాధీనం చేసుకున్నారు.