జిల్లాలో 'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల
SKLM: జిల్లాలో 2,79,100 రైతులకు రూ.156.31 కోట్లు రైతులకు జమ అయినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఆమదాలవలస లోని 'అన్నదాత సుఖీభవ' PM కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో శుక్రవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే రవి కుమార్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. రూ. 350 కోట్లతో నారాయణపురం ఆయకట్టు ఆధునీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.