'నేడు నార్సింగిలో రైతు నేస్తం'

'నేడు నార్సింగిలో రైతు నేస్తం'

MDK: రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి మండల ఇన్‌ఛార్జ్ వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ఉంటుందని అందులో భాగంగా చిరుధాన్యాల సాగులో మెలకువలు అనే అంశంపై శాస్త్రవేత్తలు వివరిస్తారని పేర్కొన్నారు. రైతులు సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.