ఓటు వేసిన 105 ఏళ్ల వృద్ధురాలు
ADB: దహేగాం మండలంలోని గొర్రెగుట్ట గ్రామానికి చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు రసూల్ ఇట్యాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించి ఆదర్శంగా నిలిచారు. వయసు పైబడినప్పటికీ ఆమె ఆసక్తిగా వచ్చి ఓటు వేయడం స్థానికులకు స్ఫూర్తినిచ్చింది. అధికారులు ఆమెకు సహాయం అందించారు. ఆమె నిబద్ధత యువతకి ఆదర్శప్రాయం.