నిధుల దుర్వినియోగం జరగలేదు: సర్పంచ్
WGL: నెక్కొండ మండలం గుండ్రపల్లి జీపీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని సర్పంచ్ బోల్ల యాదలక్ష్మి- శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకే పంచాయతీ నిధులను వినియోగిస్తున్నామని, గత పాలకవర్గం చేసిన తప్పులను తమపై రుద్దుతున్నారని ఆరోపించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.