గణితం ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
SRPT: ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో తాత్కాలిక గణితం ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీవో స్వప్న తెలిపారు. ఎంఎస్సీ, బీఈడీ అర్హత కలిగిన వారు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికైన వారు ఈ నెల 23న ఉదయం 10 గంటలకు డెమోకు హాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు 9441493359 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.