రైతు బజార్ స్థలాన్ని పరిశీలించిన జేసి

రైతు బజార్ స్థలాన్ని పరిశీలించిన జేసి

W.G: పెనుగొండ మండలం దొంగరావిపాలెంలో రైతు బజార్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పాత కొండలమ్మ గుడి సమీపంలోని ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం, ప్రస్తుతం నడుస్తున్న హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్ నిర్వహణ, రైతులకు అందుతున్న సదుపాయాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.