మంచినీటి సమస్యలకు రూ. 38.96 కోట్లు మంజూరు
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల తాగునీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 38.96 కోట్లు మంజూరు చేసింది. ‘జల్ జీవన్ మిషన్’ కింద భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 79 పనులు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తితో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేసింది.