రైతులకు GOOD NEWS
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం అందించేందుకు పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులు ఈనెల 13న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆరోజు అసోంలో పర్యటించనున్న ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 9.32 కోట్లమంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.19 వేల కోట్లు జమకానున్నాయి.