శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించిన డీఎస్పీ

శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించిన డీఎస్పీ

SKLM: జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఉన్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారిని ఇవాళ టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఈ సందర్శన తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ఆయనతో పాటు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై అశోక్ బాబు కూడా పాల్గొన్నారు.