నేడు జాబ్ మేళా
BPT: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సహకారంతో పిట్టలవానిపాలెం మండలం కాజీపేటలో మెగా ఉద్యోగ మేళా మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. 20 బహుళజాతి కంపెనీల్లో 1200 ఉద్యోగాలకు యువతను ఎంపిక చేయనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిణి మాధవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, ఆధార్ జిరాక్సులతో హాజరుకావాలని సూచించారు.