VIDEO: సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధం
GNTR: కాకుమాను మండలంలోని తెలగాయపాలెం గ్రామంలో ఇవాళ సాయంత్రం వేముల ఇశ్రాయేలు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పూరింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.