హైదరాబాద్‌లో గుడివాడ వాసి మృతి

కృష్ణా: హైదరాబాద్ మధురానగర్‌లో గుడివాడ శాంతినగర్‌కు చెందిన పవన్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గది తలుపులు తీయకపోవడంతో స్నేహితుడు సందీప్ ఇతరులతో కలిసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా, కుక్క రక్తపు నోటితో బయటికి వచ్చింది. కుక్క కరిచిన గాయాలు కనిపించాయి. పోస్టుమార్టం అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.