శక్రు నాయక్ మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే

NLG: చందంపేట మండల మాజీ ఎంపీపీ నున్సవత్ పార్వతి చందునాయక్ తండ్రి శకృనాయక్ మృతి బాధాకరమని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం తెల్దెవరపల్లి గ్రామంలో శకృనాయక్ మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.