తల్లిపాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

VZM: బిడ్డ పుట్టిన వెంటనే ఐదు నిముషాలు లోపు తల్లి ఇచ్చే ముర్రుపాలు ఎంతో అమూల్యమైనవని కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. ఆ పాలలో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయని అవి బిడ్డ ఆరోగ్యానికి ఎదుగుదలకు మహోపకారం చేస్తాయని తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా జరిగింది. తల్లిపాల గొప్పదనం గురించి అవగాహన కల్పించాలన్నారు.