జడ్పీ హైస్కూల్‌లో న్యూ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహణ
ELR: నూజివీడు మండలం అన్నవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ ఆధ్వర్యంలో గురువారం న్యూ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఎంఈఓ 2 జమలయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు యూనిఫాం, పౌష్టికాహారం అందించే మిడ్ డే మీల్, ఉచిత పుస్తకాలకు కిట్, ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్షిప్, తల్లికి వందనం వంటి పథకాలు అమలవుతున్నట్లు చెప్పారు. విద్యతో పాటు అన్ని రంగాలలో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.