రూపాయి పతనంపై RBI కీలక వ్యాఖ్యలు
రూపాయి విలువపై ఎలాంటి నిర్దేశిత స్థాయిలను నిర్ణయించుకోలేదని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. రూపాయి పతనానికి డాలర్ డిమాండే కారణమని చెప్పారు. దేశంలో సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదురుతోందని, తద్వారా దేశ కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.