విద్యార్థులు గంజాయి జోలికి పోవద్దు: SI

W.G: విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు మందులు జోలికి పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని పాలకొల్లు ఎక్సైజ్ SI మద్దాల శ్రీనివాసరావు సూచించారు. బుధవారం పాలకొల్లు గౌతమి జూనియర్ డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం యువత నడుం బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేష్ పాల్గొన్నారు.