విశాఖలో ఉత్సాహభరిత స్విమ్మింగ్ పోటీలు
VSP: INS సర్కార్స్ ఎదుట కమాండ్ స్విమ్మింగ్ పూల్లో 77వ NCC రైజింగ్ డే భాగంగా స్విమ్మింగ్ పోటీలు మంగళవారం జరిగాయి. 120 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. కార్యక్రమానికి డా. ఆడారి కిశోర్ కుమార్ హాజరయ్యారు. పోటీలను సర్జన్ కమాండర్ ఏ. నరసింహారావు పర్యవేక్షించగా, కమోడోర్ సుమనరాయ్ బహుమతులు అందజేశారు. NCC క్రమశిక్షణ, నాయకత్వానికి ప్రతీక అని కిశోర్ ప్రశంసించారు.