VIDEO: భారతీయుడికి మరిచిపోని ఆతిథ్యం ఇచ్చిన ఆఫ్ఘానీ
భారతీయుల పట్ల ఆఫ్ఘాన్ ప్రజలు చూపిస్తున్న ఆప్యాయతకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ వీడియో. కైలాష్ అనే ట్రావెల్ వ్లాగర్ ఆప్ఘాన్‌లో ఓ దానిమ్మ రసం తాగాడు. అనంతరం డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ జ్యూస్ వ్యాపారి నిరాకరించాడు. మీరు మా మోహ్మాన్(అతిథి) అంటూ డబ్బును తీసుకోలేదు. దీంతో ఆ వ్లాగర్ ఆఫ్ఘాన్ అంతటా ఇదే ఆతిథ్యం చూశానంటూ వీడియోను SMలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.