రిజర్వాయర్ గేట్లు మూసివేసిన అధికారులు

రిజర్వాయర్ గేట్లు మూసివేసిన అధికారులు

NLR: కురిసిన భారీ వర్షాల కారణంగా రాళ్లపాడు రిజర్వాయర్ నిండింది. రిజర్వాయర్ పరివాహక ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో బుధవారం రాత్రి స్పిల్ వే క్రెస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువ మన్నేరుకు వదిలారు. గురువారం ఉదయానికి ప్రవాహ ఉద్ధృతి తగ్గడంతో గేట్లను పూర్తిగా మూసివేసినట్లు ప్రాజెక్ట్ DEE వెంకటేశ్వరరావు తెలిపారు.