జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్ధిక సహాయం

VZM: ఇటీవల అనారోగ్యంతో వీడియో జర్నలిస్ట్ పోలినాయుడు మృతి చెందాడు. సోమవారం కుటుంబానికి పట్టణానికి చెందిన పలువురు జర్నలిస్ట్‌లు పోలినాయుడు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేశారు. జొన్నవలసలో సేకరించిన రూ. 45వేల మొత్తాన్ని ఇచ్చారు. భవిష్యత్‌లో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.