VIDEO: చనుపల్లిని చేనుపల్లిగా మార్చేశారు ..!

VIDEO: చనుపల్లిని చేనుపల్లిగా మార్చేశారు ..!

SRPT: నడిగూడెం మండలంలోని చనుపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డుపై పేరు తప్పుగా ముద్రించారు. చనుపల్లికి బదులుగా చేనుపల్లి అని ఉండడంతో కొత్తగా వచ్చే వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ఆ బోర్డుపై పేరును సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.