కార్మికుల హక్కుల రక్షణకు పోరాటం తప్పదు: CITU
SKLM: విశాఖలో డిసెంబర్‌లో 5 రోజులు జరిగే CITU అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని CITU జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు అన్నారు. ఆమదాలవలస పారిశ్రామిక వాడలో CITU అఖిల భారత మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని అన్నారు. కార్మికుల హక్కుల రక్షణకు పోరాటం తప్పుదని అన్నారు.