సలాడ్స్ తింటున్నారా?

సలాడ్స్ తింటున్నారా?

సలాడ్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని పోషకాలు, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యానికి దోహదపడతాయి. వీటిలో తక్కువ కేలరీలు, ఫైబర్, నీరు ఉండటంతో కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఆకుకూరలు, టమాటాలు, అవకాడోలు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.