రేపు కనిగిరిలో ఉచిత కంటి వైద్య శిబిరం

రేపు కనిగిరిలో ఉచిత కంటి వైద్య శిబిరం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్స్‌లో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేయనున్నారు. శిబిరానికి హాజరయ్యే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకురావాలన్నారు.