కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన ఎర్రబెల్లి
WGL: రాయపర్తి మండలంలో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ పూర్వ వైభవాన్ని ప్రదర్శించిందని, రానున్న ఎన్నికల్లోనూ పార్టీ ముందంజలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.