'ఉల్లి రైతులకు సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలి'
కడప జిల్లాల్లో వర్షాల వల్ల నష్టపోయిన ఉల్లి రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని రైతు సేవాసమితి జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ డిమాండ్ చేశారు. ఆదివారం కృష్ణాపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హామీ ఇచ్చి రెండు నెలలు గడిచినా రైతులకు సాయం అందకపోవడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.