తొలిసారి విమానం ఎక్కిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

తొలిసారి విమానం ఎక్కిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

కృష్ణా: ఏపీలో 26 జిల్లాల నుంచి ఎంపికైన 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురువారం తొలిసారి విమానం ఎక్కి గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. సమగ్ర శిక్ష ఏపీ సైన్స్ సిటీ సంయుక్తంగా చేపట్టిన మూడు రోజుల సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో భాగంగా భారతీయ మ్యూజియం ప్లానిటోరియంను సందర్శించనున్నారు.