8 నెలల కొడుకుని చంపిన తండ్రి

8 నెలల కొడుకుని చంపిన తండ్రి

కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో  8 నెలల కుమారుడిని తండ్రి నరేశ్‌ చంపేసి, పొలంలోని నీటి డ్రమ్ములో వదిలేశాడు. అనంతరం భార్య శ్రావణిపై హత్యాయత్నం చేశాడని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.