VIDEO: 'డ్రైవర్‌లు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి'
WGL: వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్‌లు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సీఐ శ్రీనివాస్ సూచించారు. సోమవారం వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన డ్రైవర్ నేత్ర పరీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డ్రైవర్‌లు ప్రతి మూడు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఎస్సైలు సాయిబాబు ,రామారావు తదితరులు పాల్గొన్నారు.