'ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యలు పరిష్కారం'

KMM: ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని PDSU రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వి అన్నారు. సోమవారం ఖమ్మం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ మూడో వారంలో ఖమ్మంలో PDSU రాష్ట్ర 23వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలన్నారు.