రూ.9 కోట్ల కారులో అంబానీ జంట..!
రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ, తన భార్య రాధికా మర్చంట్‌తో కలిసి ముంబైలో సరదాగా గడిపారు. సుమారు రూ. 9 కోట్ల విలువైన అత్యంత లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపేలో వీరు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. బాంద్రా-వర్లీ సీ లింక్‌పై అనంత్ స్వయంగా కారు నడుపుతుండగా, పక్కనే రాధిక కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.