కార్తీక మ‌హా దీపోత్స‌వం ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జేఈవో

కార్తీక మ‌హా దీపోత్స‌వం ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జేఈవో

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో నవంబర్ 14న జరగనున్న కార్తీక మహా దీపోత్సవం కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపారు.