13 నెలల చిన్నారిని చిదిమేసిన ఆటో
NZB: సాలూరు మండలం సాలంపాడ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి ఉల్లిగడ్డలు అమ్ముకోవడానికి ఆటోలో వచ్చిన వ్యక్తి అజాగ్రత్తగా నడిపి గ్రామానికి చెందిన 13 నెలల చిన్నారి అనయనను ఢీకొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఇర్ఫాన్ అయోష బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.