నైజిరియాలో స్కూల్ పిల్లలే లక్ష్యం.. ఎందుకంటే..!
సాయుధ మూకలు పిల్లలను వ్యూహాత్మక లక్ష్యాలుగా చూస్తున్నారని అందుకే వారిని కిడ్నాప్ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వారిని అపహరించటం ద్వారా దేశంతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చని తద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా నైజిరియా ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచి డబ్బును రాబట్టేందుకు ఒత్తిడి చేస్తారని పేర్కొన్నారు.