రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు
JGL: రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. జగిత్యాలలో నిర్వహించిన బాల బాలికల కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్, లాంగ్ జంప్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు హెచ్ఎం నర్సయ్య తెలిపారు.