ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
KRNL: తుగ్గలి మండలం ఎద్దులదొడ్డిలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సోమవారం పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు.