'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

AKP: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పారిశుద్య పనులను పరిశీలించారు. 104 మెడికల్ క్యాంపు సందర్శించి మందులను తనిఖీ చేశారు. సూపర్‌వైజర్‌లు ఎం.నాగేశ్వరావు, దినకర్, సిబ్బంది పాల్గొన్నారు.