రహదారుల అభివృద్ధికి రూ.18.16 కోట్లు
AKP: పాయకరావుపేట నియోజకవర్గంలో 13 గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.18.16 కోట్లు మంజూరు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎంకు హోంమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.2,123 కోట్లు నిధులు డిప్యూటీ సీఎం విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు.