ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
KRNL: పత్తికొండ మండలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై యఫ్యంటీ మల్లిఖార్జున ఇవాళ రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే విధానాలను వివరించారు. రసాయనాల వినియోగం వల్ల భూమి, ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఆహారం, సుస్థిర సాగు సాధ్యమని తెలిపారు.