గంగానమ్మపేట పాత శివాలయంలో భక్తుల రద్దీ

గంగానమ్మపేట పాత శివాలయంలో భక్తుల రద్దీ

GNTR: తెనాలి గంగానమ్మపేటలో పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వత వర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం కావడంతో తెల్లవారుజామునుండే భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. రామేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్ద భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకాలు చేసుకున్నారు.