పర్యాటకులను ఆకర్షిస్తోన్న రామనారాయణం
విజయనగరం సమీపంలోని రామనారాయణం ఆలయం భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తోంది. విల్లు-బాణం ఆకారంలో నిర్మితమైన ఈ ఆలయం రామాయణ ఇతివృత్తాన్ని తెలుపుతోంది. 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ క్షేత్రంలో రామాయణ గాధను వివరించేలా ఏర్పాటు చేసిన శిల్పాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఆలయ దర్శనానికి తరలివస్తున్నారు.