పింఛను అందక దివ్యాంగుల కడగండ్లు

పింఛను అందక దివ్యాంగుల కడగండ్లు

NLR: జిల్లా తోటపల్లిగూడూరు మండలంలో దివ్యాంగుల పరిస్థితి దయనీయంగా ఉంది. వరిగొండకు చెందిన 11 ఏళ్ల లలిత్ 75% వైకల్యమున్నా పింఛను అందడం లేదు. కావలికి చెందిన షేక్ రినాజ్ పింఛను ఈ-కేవైసీ, వేలిముద్రలు పడక 13 ఏళ్లుగా నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ప్రభుత్వం అందించే సాయం అందక ఈ నిరుపేద కుటుంబాలు అధికారుల చుట్టూ తిరుగుతూ కన్నీరు మున్నీరవుతున్నాయి.