పోలేరమ్మ తిరునాళ్లకు భారీ బందోబస్తు

పోలేరమ్మ తిరునాళ్లకు భారీ బందోబస్తు

GNTR: కాకుమాను మండలం కొండపాటూరులో రేపు పోలేరమ్మ తల్లి తిరునాళ్లు జరగనున్నాయి. వేలాదిగా వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా 270 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కాకుమాను నుంచి కొండపాటూరు వచ్చే వాహనాలను అప్పాపురం వైపు మళ్లించారు. భక్తులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.