నేడు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్
KMM: కామేపల్లి మండల పరిధిలోని కామేపల్లి, పాత లింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికలలో ఇవాళ ఉదయం 10 గంటలకు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ఏవో బి. తారాదేవి తెలిపారు. కోత అనంతరం వరి, పత్తి పంట అవశేషాల సమర్థ వినియోగం, మామిడిలో సాగు పద్ధతులు, మామిడి అభ్యుదయ రైతు అభిప్రాయ స్వీకరణ కాన్ఫరెన్స్‌లో జరుగుతుందని తెలిపారు.